సిద్దిపేట, ఆగస్టు16: ఆగస్టు 15 వరకు 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం చేతులెత్తేసి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కా ర్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ..తెలంగాణలో కాంగెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా మోసం పూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు.
నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ డయాగ్నోస్టిక్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా అందిన వైద్య పరీక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిందన్నారు. దీర్ఘకాలిక రోగులకు ప్రతినెలా ఉచితంగా అందించే మందులు అందడం లేదన్నారు. ఎమ్మె ల్యే హరీశ్‌రావు తెలంగాణ ఉద్యమ నాయకుడని, సీఎం రేవం త్ పాత్ర తెలంగాణ ఉద్యమంలో జీరో అన్నారు. సమావేశంలో కౌన్సిలర్ సతీష్, నాయకులు శ్రీనివాస్,రాజు,నరసింహులు, రెబల్ రమేశ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.