సిద్దిపేట, డిసెంబర్ 6: బీఆర్ఎస్ అంటేనే కాంగ్రెస్ సరార్ భయపడుతున్నదని సిద్దిపేట వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దరిపల్లి శ్రీనివాస్ అన్నారు. శక్రవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయకులు గంధం రాజు, ఆదాబ్ మెహిజ్తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలన అంటే నిర్బంధమేనా అని విమర్శించారు.
ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే కాంగ్రెస్ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని సీఎం రేవంత్ నిర్బంధ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాపాలన విజయోత్సవాలు కాకుండా నిర్బంధ పాలన విజయోత్సవాలు నిర్వహించాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ దొంగనోట్ల కేసులో, ఉద్యోగాల పేరుతో అమాయక యువతను మోసగించిన కేసులో నిందితుడని, ఆలాంటి వాడు ఫిర్యాదు ఇస్తే హరీశ్‌రావు పైన కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.