హుస్నాబాద్ టౌన్, మార్చి 15: శాసనసభ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ నిరసిస్తూ శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.
ఆందోళనలో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, మాజీ వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, మాజీ కౌన్సిలర్లు పెరుక భాగ్యారెడ్డి, గూళ్ల రాజు, భూక్యా లక్ష్మణ్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు అయిలేని శంకర్‌రెడ్డి, కన్నోజు రామకృష్ణ, గడిపె కొమురయ్య, కొంకట రవీందర్, బొల్లి శ్రీనివాస్, గోనెల మధుకర్, రాజిరెడ్డి, సదానందం, జీవన్ తదితరులు పాల్గొన్నారు.