హుస్నాబాద్, డిసెంబర్ 5: మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అక్కన్నపేట చౌరస్తాలో గురువారం బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ అక్రమంగా నాయకులను అరెస్ట్ చేస్తోందన్నారు.
ప్రభుత్వం అక్రమ అరెస్టులను నిలిపివేయడంతోపాటు హరీశ్‌రావును విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, ఎడబోయిన తిరుపతిరెడ్డి, అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, ఎం డీ అన్వర్, వాల నవీన్, బొజ్జ హరీశ్, బొల్లి శ్రీనివాస్, పరశురాములు, గద్దల రమేశ్, మ్యాక నారాయణ, బత్తుల జగ్జీవన్, నాయకులు పాల్గొన్నారు.
అక్కన్నపేట చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేస్తుండగా నాగారం రోడ్డు నుంచి వెళ్తున్న సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీవో రామ్మూర్తి వాహనాలు 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. వాహనంలోనే కలెక్టర్, ఆర్డీవోలు ఉన్నారు. తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు.