జహీరాబాద్, జూన్ 16 : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు మండిపడ్డారు. సోమవారం ఈ ఫార్ములా కేసులో ఏసీబీ ఎదుట హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వం కేసులు నమోదు చేయించడం సరికాదన్నారు.
పరిపాలనలో విఫలమైన ప్రభుత్వం కావాలనే ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఈ ఫార్ములా కేసులో మళ్లీ కేటీఆర్‌ను ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. హామీలు అమలు చేసే వరకూ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, వివిధ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ, సంజీవ్‌రెడ్డి, దేవేందర్, వెంకటేశం, నర్సింహులు, పీఏసీఎస్ చైర్మన్ మశ్చేందర్, పార్డీ నాయకులు భాస్కర్, బండిమోహన్, ప్రవీణ్‌కుమార్, నర్సింహులుగౌడ్, మోహీజొద్దీన్, అమీత్‌కుమార్, బస్వరాజ్, అశోక్‌పాటిల్, ప్రభుపటేల్, రాథోడ్ భీంరావు, వసీం పాల్గొన్నారు.