కోహీర్ : ప్రకృతి ప్రేమికుడు (Nature lover) , గొటిగార్‌పల్లి మాజీ సర్పంచ్ సిద్దాపురం విశ్వమోహన్ (88) సోమవారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచాడు. గొటిగార్‌పల్లి, బడంపేట గ్రామ పంచాయతీకి 40ఏండ్ల పాటు ఆయనను సర్పంచ్‌గా ( Sarpanch) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మల్చెల్మ ప్రధాన రహదారితో పాటు గొటిగార్‌పల్లి, బడంపేట గ్రామాల రోడ్లకు ఇరువైపులా నాటిన వందలాది మొక్కలు వృక్షాలుగా మారి ప్రజలకు నీడనిస్తున్నాయి. బడంపేట రాచన్నస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా కూడా పని చేసిన ఆయన మృతికి బీఆర్ఎస్ నాయకులు నామరవికిరణ్, మాజీ సర్పంచ్ శంకర్, తదితరులు సంతాపం తెలిపారు.