నంగునూరు, సెప్టెంబర్ 4: సిద్దిపేట నియోజకవర్గం హరీశ్‌రావు కుటుంబమని, ఆయన నాయకుడు కాదు.. సిద్దిపేట ప్రజల కుటుం బ సభ్యుడని, ప్రజా సేవకుడని.. కొంత మం ది విపత్తును కూడా రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అకాల వర్షానికి నంగునూరు మండలంలోని అక్కెనపల్లి బుడగ జంగాల కాలనీలో కొన్ని ఇం డ్లలోకి, గుడిసెలకు నీళ్లు రావడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
దీంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు వారిని పరామర్శించి విషయాన్ని మాజీమంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే బీఆర్ఎస్ మండల నాయకులతో నిత్యావసర సరుకులు హరీశ్‌రావు పంపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..హరీశ్‌రావు కృషితోనే బుడగ జంగాల కాలనీలో గతంలో డ్రైనేజీ నిర్మించుకున్నామని, నేడు అకాల వర్షాలకు నష్టం జరగడం దురదృష్టకరం అన్నారు.
కొంతమంది విపత్తును రాజకీ యం చేస్తూ పబ్బం గడుపుతున్నారని, నాడై నా, నేడైనా ఆపదలో ఆదుకునేది కేవలం హరీశ్‌రావు మాత్రమే అని అన్నారు. నష్టం జరిగిన వారి కుటుంబాలతోపాటు బుడగజంగాల కాలనీ వాసులకు మొత్తంగా 35 కు టుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్‌గౌడ్, ఎల్లంకి మహిపాల్‌రెడ్డి, కిష్టారెడ్డి, సా రయ్య, తిరుపతి, వెంకటేశం పాల్గొన్నారు.