గజ్వేల్, అక్టోబర్ 22: సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన రూ.6లక్షల పరిహారాన్ని రెట్టింపు చేసి రూ.12లక్షలు ఇవ్వాలని, ఏటిగడ్డకిష్టాపూర్‌లో చేసిన నిరాహార దీక్షలో రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీని నెరవెర్చాలని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ ఇవ్వాలన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం అందజేసిందన్నారు.
అబద్ధపు ప్రచారాలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు రెట్టింపు పరిహారం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ప్రశ్నించా రు.అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నిర్వాసితుల సమస్యలపై ఒక్కసారి కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదని, పెండింగ్ నిధులను విడుదల చేయడం లేదని, నిర్వాసిత గ్రామాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులు, బ్రోకర్లు మల్లన్నసాగర్ ప్రజలను మభ్యపెడుతూ రాజకీయలబ్ధి కోసం ప్రజల ను తప్పుదోవ పట్టిస్తూ కపటప్రేమ చూపిస్తున్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసం వచ్చే కాంగ్రెస్ పార్టీ బ్రోకర్ల ఉచ్చులో ప్రజలు పడొద్దని హితవు పలికారు.
65 ఏండ్లు నిండిన వారికి ప్యాకేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కొం తమంది కోర్టుకు వెళ్లడంతో ప్యాకేజీలు ఆగాయని, వారికి ఇచ్చే సమయంలోపే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కోర్టు తీర్పు ను కాంగ్రెస్ ప్రభుత్వం ధిక్కరిస్తున్నదని, మిగిలిన 65 ఏండ్లు నిండిన వారికి వెంటనే ప్యాకేజీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశా రు. బీఆర్ఎస్ మల్లన్నసాగర్ ముంపు గ్రామా ల ప్రజల పక్షాన నిలబడుతుందని,వారి పక్షాన పోరాడుతుందన్నారు. హైదరాబాద్ లో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, మూసీనదిలోని పేదల ఇండ్లను నిర్ధాక్షిణంగా కూల్చారన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు కట్టించిన వి ధంగా మూసీ బాధితులకు ప్రభుత్వం అద్భుతమైన ఇండ్లను కట్టివ్వాలని హరీశ్‌రావు ప్ర భుత్వాన్ని కోరారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూసీ బాధితులకు అద్భుత కాలనీ నిర్మాణం చేపట్టాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు మెట్టయ్య, నా యకులు మల్లేశం, నరేశ్, అహ్మద్, కరీం, జో డు ప్రకాశ్, భిక్షపతి, కనకరాజు పాల్గొన్నారు.