మెదక్ రూరల్ : మెదక్ (Medak) మండలం శివ్వాయిపల్లి (Shivvaipally) గ్రామానికి చెందిన మంగ సంధ్యారాణి (Manga Sandhyarani), ఆమె కుమార్తె మంగ చందన (Manga Chandana) ఈ నెల 24న తెల్లవారుజామున కర్నూలు సమీపంలో బస్సు తగులబడిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం అనంతరం వారి మృతదేహాలను కుటుంబసభ్యులు స్వగ్రామానికి చేర్చారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి శివ్వాయిపల్లి పల్లి గ్రామానికి చేరుకొని సంధ్యారాణి, చందనల మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులు ఆనంద గౌడ్, సిద్ధ గౌడ్లను పరామర్శించారు. బస్సు ప్రమాదంలో తల్లీకుమార్తె సజీవ దాహనం కావడం చాలా బాధాకరమని అన్నారు.
వారి వెంట మెదక్ మండల పార్టీ అధ్యక్షులు అంజ గౌడ్, రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షులు కొత్తపల్లి కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ సిద్దయ్య, మాజీ సర్పంచ్ మాదవి రవీందర్, పాపన్నపేట్ మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్, నాయకులు నరేందర్, విట్టల్ తదితరులు ఉన్నారు.