కొమురవెల్లి/చేర్యాల, జూన్ 3 : తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నడుస్తూ పలు కేసుల్లో జైలుకుపోయిన చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, చేర్యాల మండలంలోని ఆకునూరుకు చెందిన సుంకరి మల్లేశంగౌడ్, చేర్యాల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్యను సోమవారం సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సన్మానించాడు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటపటిమ చూపిన ఇద్దరినీ మాజీమంత్రి అభినంధించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.