నర్సాపూర్ : నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధుల మంజూరు చేయించడానికి కృషిచేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పంబాల భిక్షపతి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోక వెనుకబడిపోయిందని గుర్తు చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వంపై, ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం నర్సాపూర్ మున్సిపాలిటీకి రూపాయలు 15 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో నర్సాపూర్‌లో పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేయాలని, అలాగే సిసి రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సమస్య, రహదారులు, మురికి కాలువలు నిర్మించి నర్సాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.