జహీరాబాద్, అక్టోబర్ 18: లోకల్ వ్యక్తిని శాసనసభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్‌రావు కోరారు. బుధవారం జహీరాబాద్ మండలంలోని బుర్థిపాడు, తుంకుంట, బుచినెల్లి, సత్వార్, చెరాగ్‌పల్లి, కాశీంపూర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ స్థానిక వ్యక్తికి అవకాశం కల్పించారని, శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించాలన్నారు. పేదల సమస్యలు పరిష్కరించేందుకు 24 గంటలు జహీరాబాద్నే అందుబాటులో ఉంటాన్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో లేని హామీలు అమలు చేసి ఆదర్శంగా నిలిచిందన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ఓట్లు వేసి ఆదరించండి.. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాన్నారు. ఎన్నికల్లో గెలిపొందిన వెంటనే వంటగ్యాస్‌ను రూ.400 అందజే యనుండగా, రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.16 వేలు చేస్తామని ప్రకటించారని మ్యానిఫెస్టోలోని హామీలను ప్రజలకు వివరించారు. బుర్థిపాడు, తంకుంట, బుచినెల్లి, సత్వార్, చెరాగ్‌పల్లి, కాశీంపూర్ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కరానికి కృషి చేస్తాన్నారు.
కాంగ్రెస్ చేసింది ఏమిటీ..
– రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్
ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ దేశంలో పాలన చేసింది. ఎందుకు అప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయలేదని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎం కేసీఆర్ ఎన్నో మార్పులు తీసుకువచ్చారన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగరీథ నీరు, వ్యవసాయానికి కాళేశ్వరం నీటిని ఎత్తిపోతల ద్వారా పంటల సాగుకు అందిస్తున్నారన్నారు.
కాళేశ్వరం నీటిని సింగూర్ ప్రాజెక్టులో నింపి, ఎత్తిపోతల ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 1.06 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో నిధులు మంజూరు చేశారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు బుచినెల్లి, బుర్థిపాడు, తుంకుంట శివారులోని పారిశ్రామికవాడల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావుకు భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ తన్వీర్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి.గుండప్ప, టెలికం బోర్డు సభ్యులు పవార్ శంకర్ నాయక్, జహీరాబాద్ పట్టణ, మండల, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాధ్యక్షులు సయ్యద్ మోహినొద్దీన్, తట్టు నారాయణ, రవీందర్, నర్సింలు, వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు విజయ్‌మోహన్, సంజీవ్‌రెడ్డి, కుద్బుద్దీన్, తంజీం, మహిళా నాయకురాలు మంజుల, సరస్వతిరెడ్డి, మాణెమ్మ, అనూషమ్మ, తూంకుంట సర్పంచ్ రాజు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.