మనోహరాబాద్, మే 23 : కాంగ్రెస్ పాలనలో పంటలు పండించడం, పండిన పంటలు అమ్ముకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
ఆ తర్వాత రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి 44వ జాతీ య రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించేందుకు వంటేరు ప్రతాప్‌రెడ్డి సహా బీఆర్ఎస్ శ్రేణులు వెళ్తుండగా, అప్పటికే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ పట్టు విడవకుండా జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం విలేకరుల సమావేశంలో వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ పాలనలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సజావుగా ధాన్యం కొన్నట్లు గుర్తుచేశారు.

కొనుగోలు కేం ద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో వేసినట్లు తెలిపారు. రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు వంటి పథకాలతో కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి విస్మరించారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్కడిక్కడే నిలిచిపోయిందన్నారు.
కొన్న ధాన్యం డబ్బులు వారాలు గడుస్తున్నా రైతులకు అంద డం లేదన్నారు. వర్ష్షాకాలం సమీపిస్తుండడంతో వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని అధికారులను ఫోన్ ద్వారా వంటేరు ప్రతాప్‌రెడ్డి కోరారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, సర్పంచ్ సాయికుమార్, మాజీ సర్పంచ్ అర్జున్, మాజీ ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, నాయకులు ఉదయ్ రంజన్గౌడ్, మహిపాల్, ప్రతాప్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.