కొల్చారం, నవంబర్ 8: ప్రభుత్వం రైతులను వంచిస్తూ ధాన్యం తూకంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా శనివారం కొల్చారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతులతో భారీ ధర్నా చేపట్టబోతున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కొల్చారలో స్థానిక నాయకులతో కలిసి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..
రైతులతో కలిసి చేపట్టే ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, భూపాల్‌రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి వెంకట్రామి రెడ్డి, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే మాణిక్యరెడ్డి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షుడు కోణాపురం సంతోష్ రావు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, రవితేజ రెడ్డి, కరెంటు రాజా గౌడ్, నింగోల్ల చెన్నయ్య, ఎండుగుల కృష్ణ, పాండ్ర వెంకటేశం, ఆశన్నగారి, కిష్టయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.