రామాయంపేట, జూలై 04 : మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో రామాయంపేట మున్సిపల్‌కు బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్దికి నిధులు మంజూరు చేసి టెండర్లు పూర్తి చేస్తే బీఆర్ఎస్ పార్టీ అభివృద్ది చేయలేదని తామే కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి నిధులను తెచ్చామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గు చేటైన విషయమని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి మండి పడ్డారు. శుక్రవారం రామాయంపేటకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేకంగా రామాయంపేట పట్టణ అభివృద్ది కోసం బీఆర్ఎస్ హయాంలోనే టీయూఎఫ్ఐడీసీ నిధుల నుండి రూ.35 కోట్లను మంజూరు చేశామన్నారు. వాటికి టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అభివృద్ది పనులకు సిద్దంగా ఉన్న నిధులను తామే మంజూరు చేశామంటూ కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు. మీకు గనుక దమ్ము ధైర్యం ఉంటే అభివృద్దికి నిధులను తీసుకురండి తీసుకొచ్చి అభివృద్ది చేయండి అందుకు తాము కూడా మద్దతు తెలుపుతామన్నారు. తాము తెచ్చిన నిధులకు తాము అప్పుడే శిలాఫలకాలు వేశాం.మళ్లీ వాటికే కొత్తగా మేము తీసుకొచ్చామంటు కొబ్బరికాయలు కొట్టడం శిలాఫలకాలను ఆవిష్కరించడం తగదన్నారు. అసెంబ్లీ చివరలో అప్పటి సీఎం కేసీఆర్ సార్ ఎస్డీఎఫ్ నిధులనుండి రూ.25 కోట్లను మంజూరు చేశారు. అది అప్పట్లో అసెంబ్లీలోనే కేసీఆర్ తెలిపారు. మీకు అభివృద్ది చేయాలనుకుంటే కేసీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్లను తీసుకురండి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా జిల్లాలు, మండలాలు, డివిజన్లు ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని మరువద్దన్నారు. మేము నిధులు తెస్తే షోకులు మీరు చేయడం పద్దతి కాదన్నారు.
19 నెలలైనా ఒక్క రూపాయి తీసుకురాని ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 19 నెలలు గడుస్తుంది. ఇంతవరకు ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్‌రావు ఒక్క రూపాయి కూడా తెచ్చి ఖర్చు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. మెదక్ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మీ అభివృద్ది ఎక్కడుందో చెప్పండి అని ప్రశ్నించారు. మెదక్ పట్టణంలో 100 సీట్ల మెడికల్ కళాశాల మంజూరు చేస్తే అందులో నుండి 50 సీట్లను సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తన్నుకు పోయారని ఆరోపించారు. మీరు నిధులు మంజూరు చేసింది ఏది ఒక్కసారి చెప్పండి అని మండిపడ్డారు. మా తెలంగాణ రాష్ట్రంలోనే ముందుగా అసెంబ్లీలో రామాయంపేటను రెవెన్యు డివిజన్‌గా, డిగ్రీ కళాశాలను రామాయంపేటకు మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. డిగ్రీ కళాశాలలో తమవల్ల నేడు వందల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. డివిజన్‌కు జీవోలు తెచ్చి ప్రారంభిస్తే ఇప్పుడున్న సర్కార్ కనీసం కార్యాలయంలో సిబ్బందిని కూడా సమకూర్చకుండా చేస్తుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ వాళ్లు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్దే జరుగలేదం టూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వారు చేసే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. తాము ప్రజల కోసం పనిచేశాం. మెదక్, రామాయంపేటలలో నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూమ్‌లను కట్టించి ఇచ్చాం అది గుర్తుకు తెచ్చుకోండని అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నోటికొచ్చినట్లు నోరు పారేసుకోవడం తప్ప మీతో ఏమీ కాదన్నారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటి ప్రజావసరాలను తీర్చడం లేదన్నారు. ముందు మీరిచ్చిన హామీలను అమలు చేయండి అని అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో రామాయంపేట పురపాలిక మాజీ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మాజీ పురపాలిక వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండల్‌రెడ్డి, ఎస్కే.హైమద్, ఉమామహేశ్వర్, సుభాష్ రాథోడ్, కాట్రియాల శాములు, రాజేందర్ గుప్త, మైలారం భిక్షపతి, డాకి శ్రీనువాస్, శ్రీకాంత్సాగర్, పాతూరి సాయి, ఐలయ్య, భూమ మల్లేశం, నిజాంపేట మండల ఆర్టీ అధ్యక్షుడు పరుపాటి సుధాకర్‌రెడ్డి, కన్నపురం కృష్ణాగౌడ్, అస్నొద్దీన్, నాగుర్జున, ఒద్ది స్వామి, భాణుచందర్, చింతల రాములు తదితరులు ఉన్నారు.