దుబ్బాక ,ఆగస్టు 16: మోచేతికి బెల్లం పెట్టినట్లుగా రైతు రుణమాఫీ చేసి సీఎం రేవంత్‌రెడ్డి అన్నదాతలను మోసం చేశాడని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాకలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విధంగా అమలు చేయలేదన్నా రు. రూ.31 వేల కోట్లలో కనీసం రూ.26 వేల కోట్ల రుణమాఫీ చేయలేదన్నారు. రైతు రుణమాఫీలో సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడలేదని విమర్శించారు.
కాంగ్రెస్ అంటేనే మోసాలకు మారుపేరని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్పై పని కట్టుకొని బురదజల్లడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్‌రెడ్డికి, ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. సీఎం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు. రైతులను మోసగించిన సీఎంకు త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు స్వామి, భూంరెడ్డి, కృష్ణ, ఖలీల్, లచ్చయ్య,యాదగిరి, రాజిరెడ్డి, రమణ పాల్లొన్నారు.