నారాయణఖేడ్, అక్టోబర్ 1: మూసి బాధితులకు భరోసానిచ్చేందుకు వెళ్తున్న మాజీమంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం సిగ్గుచేటని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో దాడుల సంస్కృతిని తెచ్చి సీఎం రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను పక్కకు బెట్టి, బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగడం రేవంత్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారిని ప్రజలే తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ నేతలపై దాడులు మానకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.