నర్సాపూర్ : నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో నేను చేసిన అభివృద్ధి తిరిగి నన్ను గెలిపిస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి లలిత వెల్లడించారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ పార్టీతోనే నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో వార్డు ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని బాహాటంగా చెబుతున్నారని వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా సేవలోనే ఉంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
