వెల్దుర్తి, మార్చి 26 : ‘అభివృద్థి, సంక్షేమ పథకాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు పైసలు ఇస్తుంటే, ప్రధాని మోదీ రోజురోజూ ధరలు పెంచుతూ ప్రజల నుంచి పైసలు గుంజుకుంటుండు’.. అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం మాసాయిపేటలో నర్సాపూర్ నియోజకవర్గంలో మొదటి ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమ్మేళనానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఆత్మీయ సమ్మేళన జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ప్రజల గురించి పరితపించే నాయకుడు ఆయనేనని అన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించారన్నారు. దేశాన్ని 75 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ సమావేశానికి మండలంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గ్రామాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు తదితర వాహనాల్లో సమావేశానికి తరలివచ్చారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు పైసలు ఇస్తుంటే, ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అసమర్ధ పాలనతో ధరలు పెంచి ప్రజ ల నుంచి పైసలను గుంజుకుంటుండని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ ఎట్లుండే.? ఇప్పుడు ఎట్లుందని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షాల పాలనలో చావులు అయిన సమయంలో స్నానాలు చేయాలంటే కరెంట్ లేక గోసలు పడ్డామని, అధికారులను బతిమిలాడి పదినిమిషాలు కరెంట్ వేసుకునే పరిస్థితులు ఉండేవన్నారు. నేడు క్షణం కూడా కరెంట్ పోయే పరిస్థితులు లేవన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటిని ఇచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ రాకముందు రూ.450 ఉన్న గ్యాస్ ధర, ఇప్పుడు మూడింతలు పెరిగి రూ.1200 అయ్యింది, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి, నిరుపేదలపై భారం పడుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న మోదీ లక్షలాది మంది ఉద్యోగులను వారి కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారని, రాష్ట్రంలో మాత్రం బీజేపీ నాయకులు నిరుద్యోగులతో చెలగాటం ఆడుతూ గ్లోబెల్ ప్రచారాలను చేస్తున్నారన్నారు.
వెల్దుర్తి, మార్చి 26: అభివృద్థి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ ప్రజలకు పైసలు ఇస్తుంటే.. ప్రధాని మోదీ అసమర్ధ పాలనతో ధరలను పెంచి పైసలు గుంజుకుంటుండని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన మాసాయిపేటలో ఆత్మీయ సమ్మేళనాన్ని బీఆర్ఎస్ మాసాయిపేట మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అసంఘటితరంగ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉమ్మన్నగారి దేవేందర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. దేశాభివృద్ధి, వృథాగా పోతున్న నీళ్లను మళ్లించి దేశాన్ని సస్యశ్యామలం చేయడానికి, తెలంగాణ పథకాలను దేశంలో అమలు చేయడానికే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించి దేశ రాజకీయాల్లోకి వెళ్లారన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మె స్థితిలో లేరని, అందుకే బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నారన్నారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, శ్రేణులు..
మాసాయిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మండలంలోని పలు గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కొప్పులపల్లి నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, స్టేషన్ మాసాయిపేట నుంచి నాయకులు స్టేషన్ శ్రీను, రామంతాపూర్ నుంచి రైతుబంధు మండలాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, రామంతాపూర్తండా నుంచి సర్పంచ్ ఫకీరా, ఎంపీటీసీ సోని శ్రీనునాయక్, బొమ్మారం నుంచి సర్పంచ్ శంకర్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల నుంచి కార్యకర్తలు బీఆర్ఎస్ జెండాలు, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి మద్దతుగా నినాదాలు చేస్తూ సమావేశానికి తరలివచ్చారు. రామంతాపూర్తండా గిరిజన మహిళలు సమావేశానికి ముందుకు తమ గిరిజన నృత్యంతో అలరించారు.
ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ మాసాయిపేట మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సిద్దిరాములుగౌడ్, మాజీ సర్పంచ్‌లు నాగరాజులు సమావేశం ఏర్పాట్లు చేయగా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, నాయకులు నరేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. నర్సాపూర్ నియోజకవర్గానికి ఈశాన్య ప్రాంతమైన మాసాయిపేట మండలం, రామంతాపూర్ నుంచి ఏ పని మొదలుపెట్టినా విజయవంతమవుతాయని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సెంటిమెంట్. మొదటి ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం మాసాయిపేటలో ప్రారంభించగా, పెద్దఎత్తున కార్యకర్తలు, శ్రేణులు తరలివచ్చారు. మాసాయిపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రెండోసారి సొసైటీ డైరెక్టర్‌గా ఎన్నికైన ఊదండపురం నర్సింహులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సమావేశంలో జిల్లా కోఆప్షన్ మన్సూర్, ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, వెల్దుర్తి మండలాధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు శంకర్, పెంటయ్య, నర్సింహు లు, లక్ష్మి, విఠల్, ఎంపీటీసీలు సోని, నాయకు లు సిద్దిరాములుగౌడ్, నాగరాజు, సిద్దిరా ములు, బాలేశ్, బాల్‌రెడ్డి, శ్రీదర్గుప్తా, అచ్చంపేట శ్రీను, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్..
– నర్సాపూర్ ఎమ్మెల్యేమదన్రెడ్డి
కార్యకర్తలకు, శ్రేణులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సౌకర్యా న్ని కల్పించి, ఏదైనా ప్ర మాదం జరిగితే వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అం దించి ఆదుకుంటున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను హల్దీలో ప్రవహిస్తున్నాయని, వెల్దుర్తి, మాసాయిపేట మండలాలు సస్యశ్యామలం అయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి అన్ని వర్గాలు పార్టీని, నాయకులను ఆదరిస్తున్నాయని, ఇతర పార్టీల నుంచి మరింత మంది పార్టీలో చేరనున్నారన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం..
– దేవేందర్‌రెడ్డి, అసంఘటితరంగ కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్
బీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి పథకాలతోనే అభివృద్ధి సాధ్యమని అసంఘటితరంగ కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్ దేవేందర్‌రెడ్డి అన్నారు. గతంలో పాలించిన ప్రతిపక్షాలకు అప్పుడు అభివృద్ధి చేయాలన్న సోయి లేదని, కానీ ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నాయన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలతో కార్యకర్తలు, శ్రేణులు అందరిలో సమన్వయం ఏర్పడుతుందని, అందరం ఏకతాటిపై నిలబడి బీఆర్ఎస్ను మరోమారు గెలింపించాలన్నారు.
విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్
– మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకొని రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. దేశంలో వృథాగా ఉన్న వనరులను, నీళ్లను మళ్లించి దేశాన్ని సస్యశ్యామలం చేయడమే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్ జిల్లాకు పూర్తిస్థాయిలో నీటిని తరలించి, సాగు, తాగునీటి కష్టాలను పూర్తిగా తొలగించనున్నారన్నారు. మాసాయిపేట మండల ఏర్పాటు సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కృషితోనే సాధ్యమైందన్నారు. బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని ఇప్పటిలాగే ఆదరించి, ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.