Sibling Murder | మునిపల్లి, ఫిబ్రవరి 14: భూ వివాదంలో అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చీలపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చీలపల్లి గ్రామ వాసి మలక్కగోని యాదయ్య తన సొంత తమ్ముడు మలక్కగోని శివయ్య (37)ను బండరాయితో కొట్టి చంపాడు.
శివయ్య తండ్రి పేరుపై గల భూమిని తండ్రి చనిపోగానే అన్న మల్కాగౌని యాదయ్య పేరుపై రిజిస్టర్ చేసుకుని తమ్ముడికి డబ్బులు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. భూమి పైసలు ఇవ్వాలని అన్న యాదయ్యను తమ్ముడు శివయ్య పైసలు అస్తమానం అడుగుతున్నాడు. దీంతో కోపానికి గురైన అన్న యాదయ్య శుక్రవారం మద్యం మత్తులో తమ్ముడిని కింద పడేసి బండరాయితో కొట్టి చంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ తరలించారు.