క్రీడారంగంలో ఉజ్వల భవిష్యత్
క్రీడారంగంలో ఉజ్వ ల భవిష్యత్ ఉందని, విద్యార్థు లు చదువుతోపాటు క్రీడల్లో రా ణించాలని ఇఫ్కో డైరెక్టర్ దేవేం దర్‌రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడ లు దేహదారుడ్యానికి, మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 11 : క్రీడారంగంలో ఉజ్వ ల భవిష్యత్ ఉందని, విద్యార్థు లు చదువుతోపాటు క్రీడల్లో రా ణించాలని ఇఫ్కో డైరెక్టర్ దేవేం దర్‌రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడ లు దేహదారుడ్యానికి, మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నారు. జిల్లా కేంద్రంమెదక్లోని వెస్లీ స్కూల్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టౌర్నమెంట్‌ను శనివారం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్‌తో కలిసి ప్రా రంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శారీరకంగా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే మానసికంగా ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. క్రీడలతో స్నేహభావం పెంపొందడంతోపాటు పోటీతత్వం, ఆత్మైస్థెర్యం పెరుగుతుందని తెలిపారు. ఆటల్లో గెలుపోటము లు సహజమని, పోటీతత్వంతో గెలువడమే ముఖ్యమన్నారు. కార్యక్ర మంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్, కౌన్సిలర్లు జయరాజ్, శ్రీనివాస్, స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జుబేర్, బీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు సంశాన్సందీప్ పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాస్థాయి క్రీడాపోటీలు
పాపన్నపేట, ఫిబ్రవరి 11 : మండలపరిధిలోని ఆరేపల్లి గ్రామంలో జిల్లాస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయమని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ అన్నారు. ఆరేపల్లిలో నరేందర్, రజనీకాంత్‌రావు స్మారక కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చందనాప్రశాంత్‌రెడ్డి, ఏడుపాయల ఆలయ చైర్మన్ బాలాగౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు కుమ్మరి జగన్, శ్రీనాథ్, ఎంపీటీసీ కుబేరుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట రెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
‘కేసీఆర్ కప్’ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
తూప్రాన్, ఫిబ్రవరి 11 : ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు పురష్కరించుకుని నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ వాలీబాల్ టోర్నమెంట్‌ను మున్సిపల్ రాఘవేందర్‌గౌడ్, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి ప్రారంభించారు. తూప్రాన్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ‘కేసీఆర్ కప్’ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న ఫైనల్ పోటీలు, 17న బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మామిడి వెంకటేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, నాయకులు వెంకట్‌గౌడ్, సత్యలింగం, తలారి మల్లేశ్, సత్తార్, వెంకట్, శ్రీకాంత్‌తోపాటు క్రీడాకారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

