మెదక్ మున్సిపాలిటీ, మే 31: మెదక్‌లో (Medak) మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో మాత నల్ల పోచమ్మకు బోనాలు నిర్వహించనున్నారు. ఈమేరకు మున్నూరుకాపు సంఘం పట్టణ అద్యక్ష, కార్యదర్శులు గట్టేశ్, అశోక్, బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు నల్లాల విజయ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగే బోనాల ఉత్సవాలలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర మున్నూరుకాపు సంఘం నాయకులు పాల్గొనున్నట్లు తెలిపారు.
సాయంత్రం రాందాస్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్, గోల్కోండ వీధి మీదుగా ఆటోనగర్‌లోని నల్లపోచమ్మ దేవాలయానికి చేరుకోని అమ్మవారికి బోనాలు సమర్పించుకోని మొక్కులు తీర్చుకుంటరన్నారు. ఈ సందర్భంగా నల్ల పోచమ్మ దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. దీంతోపాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఆయా దేవతల ప్రతిమలను విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేశారు.