మెదక్, నవంబర్ 12 : సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రంలోని రాం దాస్ చౌరస్తాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీ ఎత్తున మెదక్ పట్టణంలోని బస్లాండ్, పోస్టాఫీస్‌ల మీదుగా చిల్డ్రన్స్ పార్కు, రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 14 ఏండ్లు చావునోట్ల తలపెట్టి.. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో’ అని కేంద్రం మెడలు వచ్చి రాష్ర్టా న్ని సాధించారని తెలిపారు. ఏడేండ్లు సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి కృషిచేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనమని చెప్పి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని తెలిపారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే మోడీ వద్దకు వెళ్లి తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనాలని చెప్పం డి.. కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తే లాభం లేదన్నారు. ఇక మీ పప్పుడు ఉడకవని, బీజేపీపై దం డయాత్ర చేస్తామని హెచ్చరించారు.
బీజేపీని బొందపెట్టాలి :ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
2001లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, 2014 కన్నా ముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం దుకాణాల చుట్టు తిరిగారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు రెండు పంటలు సంతోషంగా పండిస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నా రు. బీజేపీని బొందపెడుతామన్నారు. 2014లో సీఎం కేసీఆర్ రామాయంపేటలో రైతులపై లాఠీచార్జి జరిగిందని, ఆరు నెలల్లోనే సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్‌తోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. తెలంగాణలో కాళేశ్వరం ద్వారా నీరు అన్ని ప్రాజెక్టులు, చెరువుల్లోకి వస్తున్నాయని, దీంతో రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామంలో రూ.2 నుంచి 3 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, నార్సింగి వైస్ ఎంపీపీ సుజాత, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, యువ న్యాయవాది జీవన్‌రావు, మెదక్ నియోజకవర్గంలోని అయా మండలాల మండల అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.