బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్ జోలికి వస్తే సహించేదిలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో వారు మాట్లాడారు. బండి సంజయ్ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై అవాకులు చవాకులు పేలితే సరైన రీతిలో బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పాలనలో, మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సంగారెడ్డిలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ ఘోరంగా ప్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల తిరస్కరణ ఎదుర్కోక తప్పదని జోస్యం చెప్పారు.
-సంగారెడ్డి, మే 12 (నమస్తే తెలంగాణ)
సంగారెడ్డి, మే 12 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్ జోలికి వస్తే సహించేదిలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై అవాకులు చవాకులు పేలిస్తే సరైన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పాలనలో, మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సంగారెడ్డిలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ ఘోరంగా ప్లాఫ్ అయ్యిందన్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల తిరస్కరణ ఎదుర్కోక తప్పదన్నారు. సంగారెడ్డిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, హ్యాం డ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
మంత్రి హరీశ్‌రావు జోలికి వస్తే సహించం
బండి సంజయ్.. మంత్రి హరీశ్‌రావు జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ హెచ్చరించారు. మంత్రి హరీశ్‌రావు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు సంజయ్ కరీంనగర్లో రోడ్లపై తిరుగుతున్నారన్నారు. నిరుద్యోగ మార్చ్ ప్లాప్ కావటంతో బండి సంజయ్ మతి భ్రమించి ఇష్టారాజ్యంగా మాట్లాడారన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి ఖాయమని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతుందన్నారు. సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మార్చిలో జనం కరువయ్యారన్నారు. 3 వేల మందికి కూడా హాజరుకాలేదని తెలిపారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ శ్రీహరి, కొండల్‌రెడ్డి, ప్రభుగౌడ్, నర్సింహులు, శ్రవణ్‌రెడ్డి, వాజిద్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న బీజేపీ: చింతా ప్రభాకర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామని చింతా ప్రభాకర్ హెచ్చరించారు. బీజేపీ అధికార దాహం కోసం యువతను తప్పుదారి పట్టిస్తున్నదని, నిరుద్యోగల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి చేయటంతోపాటు ఉద్యోగాలు భర్తీ చేస్తారని, రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. కేంద్రంలోని మోదీ ఉద్యోగాలు భర్తీ చేయకపోగా, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి, ఎంపీలు ఉన్నా ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు తీసుకురాలేకపోయారని తెలిపారు. ఆర్టీసీని కాపాడటంతోపాటు 17 లక్షల ప్రైవేటు కొలువులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. యాదాద్రి ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. కొడగట్టు ఆలయం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు జోలికి వస్తే సహించమన్నారు.
బండి సంజయ్‌కి మతి భ్రమించింది: ఎమ్మెల్యే క్రాంతికిరణ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు గురించి మాట్లాడే అర్హత బండికి లేదన్నారు. సంజయ్‌ది నిత్కుష్ట మనస్తత్వమని చెప్పారు. అలాంటి వ్యక్తికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ నిరుద్యోగులపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే కేంద్రంలోని మోడీతో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయించాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని, మరో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. మోడీ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ ఉద్యోగుల ఉసురు తీసుకుంటున్నారని తెలిపారు. కేంద్రం నుంచి 1.95 లక్షల కోట్ల నిధులు రావాలని, దమ్ముంటే ఆ నిధులు రాబట్టాలని సవాల్ చేశారు. సంజయ్‌కు దమ్ముంటే సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానను, మెడికల్ కాలేజీని సందర్శించి అక్కడి వైద్య సేవలు గురించి తెలుసుకోవాలన్నారు. మరోమారు హరీశ్‌రావు జోలికి వస్తే తగిన శస్తి తప్పదని హెచ్చరించారు.
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?: ఎమ్మెల్యే మాణిక్‌రావు
సంగారెడ్డిలో బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ ఫెయిల్ అయ్యిందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పాలనలో రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. దమ్ముంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బండి సంజయ్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిరుద్యోగులను బీజేపీ పార్టీ తప్పుదారి పట్టించి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి వ్యవసాయం గతిని మార్చారన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను మోదీ కాపీ కొడుతున్నట్లు ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాని నేతలు తమను గెలిపించాలంటూ ప్రజలను కోరడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం కనీసం రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయలేదని సీఎం కేసీఆర్ రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నారు. జహీరాబాద్‌లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్నట్లు చెప్పారు.