శతమానం భవతి
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు.
- ఘనంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
- కేక్ కట్ చేసి బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు
- దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ
- ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- బడుల్లో విద్యార్థులకు విద్యాసామగ్రి అందజేత
- వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ పుట్టినరోజును బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యేలతోపాటు ప్రజాప్రతినిధులు,అభిమానులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణను ఐటీ రంగంలో దేశంలోనే అగ్రభాగాన నిలిపారని, రాష్ర్టానికి ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తున్నారని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
– సంగారెడ్డి/మెదక్ న్యూస్‌నెట్‌వర్క్, జూలై 24
నర్సాపూర్, జూలై 24: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ ఏరియా దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్‌గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయోమోద్దిన్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్, నాయకులు హబీబ్‌ఖాన్, నగేశ్, ఆంజనేయులుగౌడ్, నాగరాజుగౌడ్, కృపాచారి, దావూద్ , సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి, జూలై 24: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, సంబురాలు జరుపుకొన్నారు. డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యమ్ ప్రభుత్వ దవాఖానలో పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని జిల్లా ముదిరాజ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు కేక్ కట్ చేశారు. వేడుకల్లో సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లయ్యగారి ప్రభుగౌడ్, సర్పంచ్‌లు మోహన్‌నాయక్, రుక్మోద్దీన్, పార్టీ కంది మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, చక్రపాణి, నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు, నర్సింలు, డాక్టర్ శ్రీహరి, విజేందర్‌రెడ్డి, ఎన్ఆర్ఐ షకీల్, నసీబోద్దిన్, లాడే మల్లేశం, దిడ్డి విఠల్, ప్రభుదాస్, మోహన్‌రెడ్డి, శంకర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రావి ఆకుపై మంత్రి కేటీఆర్ చిత్రం
నారాయణఖేడ్, జూలై 24: నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై మంత్రి కేటీఆర్ చిత్రా న్ని చెక్కాడు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ను పురస్కరించుకుని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

