Collector Rahul Raj | పాపన్నపేట, ఏప్రిల్ 21 : భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమమే భూభారతి అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఇవాళ పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో భూభారతిపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి కంటే అత్యంత ఉత్తమమైన పోర్టల్ భూభారతి అని పేర్కొన్నారు.
ముందుగా కలెక్టర్ భూభారతి చట్టంలోని ప్రభుత్వ మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. భూభారతి చారిత్రాత్మక చట్టం అని.. నూతన భూ భారతి చట్టంతో భూమికి భూధార్ కార్డు జారీచేయనున్నట్లు తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించడానికి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుందని వెల్లడించారు.
సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించడానికి భూభారతి ద్వారా మంచి అవకాశం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ పరిపాలన అధికారి వస్తారని.. భూభారతి చట్టం ద్వారా అప్పీల్ వ్యవస్థ ఏర్పడిందని.. ఇలా రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోందన్నారు. అవగాహన సదస్సులో రైతుల సలహాలు, సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, మండల ప్రత్యేక అధికారి సురేష్ బాబు, తహసీల్దార్ సతీష్, ఏవో మాధురి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పుల్లన్న గారికి ప్రశాంత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లింగన్నగారి మల్లప్ప, పార్టీ అధ్యక్షుడు గోవింద్ నాయక్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్ గుప్త , మాజీ కోప్షన్ సభ్యులు గౌస్, సతీష్, ఆకుల శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ అప్ప, లింగంపేట నరేందర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, మురళి, శ్రీనివాస్, రాజకుమార్, కిష్టయ్య, అబిద్, విఠల్, ఆంజనేయులు, ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం