పాపన్నపేట్, జూన్ 23 : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గాభవానీ మాతను ఆదివారం పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ సతెల్లి బాలగౌడ, రవివీర్ కుమార్, సూర్యశ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి,తోట నర్సింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్ తదితరులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. వేద పండితులు శంకరశర్మ, పార్ధివశర్మ,మురళీధర్, రాజశేఖర్ అమ్మవారికి పూజలు చేశారు. పాపన్నపేట్ ఎస్సై నరేశ్ తన సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.