8 గుంటల కౌలు భూమిలో పది రకాల కూరగాయల సాగు

- భూమిలేకున్నా, కౌలు భూమిలో సాగు చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు
రామాయంపేట, డిసెంబర్ 7 : ఆ నిరుపేద గిరిజన మహిళా కుటుంబానికి భూమిలేదు. వ్యవసాయం చేయడంలో మాత్రం అందరికీ ఆదర్శం. రామాయంపేట మండలం కోనాపూర్ గిరిజన తండాకు చెందిన మాలోత్ లత. తండాలోనే ఓ గిరిజన రైతుకు చెందిన భూమిని కౌలు తీసుకొని కూరగాయలను పండిస్తున్నది. ఎనిమిది గుంటల భూమిని కౌలుకు తీసుకొని అందులో పది రకాల అంతర పంటలను పండిస్తూ .. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. తాను కౌలుకు తీసుకొన్న భూమిలోనే కూరగాయ పంటలైన టమాట, కొత్తిమీరా, పూదీనా, పాలకూర, బెండ, ఉల్లి, వంకాయ, పెద్ద చిక్కుడు తదితర పంటలను పండిస్తున్నది.అంతర పంటలవైపు మహిళా రైతు మళ్లడంతో వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఆమెకు పంటలపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. 80 రోజుల్లోనే పంట చేతికి రావడంతో వాటిని రోజువారీగా గంపల్లో తీసుకెళ్లి అంగడిలో విక్రయాలు జరుపుతోంది. మూడు నెలల్లోనే రూ. లక్ష ఆదాయాన్ని ఆర్జించింది. భర్త ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ చేయడం, సాగులో సాయం చేస్తూ, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నామని తెలిపింది.
అంతర పంటలపై అవగాహన కల్పిస్తున్నాం..
రామాయంపేట మండలం, కోనాపూర్ క్లస్టర్ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనే పొలాల వద్దకు వెళ్లి అంతర పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు క్లస్టర్ పరిధిలోని 30 ఎకరాల వరకు రైతులు కూరగాయల పంటలను పండిస్తున్నారు.
- వినోద్ కుమార్, ఏఈవో,రామాయంపేట
కూరగాయల సాగుతో లాభాలు..
తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లుగా కూరగాయల సాగుతోనే లాభాలు గడించొచ్చు. నేను కౌలుకు తీసుకున్న ఎనిమిది గుంటల భూమిలో పది రకాల పంటలను పండిస్తున్నా. ఒక పంట చేతికి రాగానే, వాటిని విక్రయిస్తూ.. మరొక పంట సాగు చేస్తున్నా. ఇలా రెండేండ్లుగా కౌలు భూమిలో కాయగూరలను పండి స్తూ.. లాభాలను గడిస్తున్నా.
-మాలోత్ లత, మహిళా కౌలు రైతు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

