Siddipeta | రాయపోల్, మార్చి8 : సిద్దిపేట జిల్లాలోని రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పంజాల కార్తిక అనే విద్యార్థిని చెన్నైలో జరిగిన ఆవర్తన పట్టికలలోని 118 మూలకాలను 8 సెకండ్ల 85 మిల్లీ సెకండ్స్లలో చెప్పి ప్రపంచ రికార్డును సృష్టించింది. ఈ విషయాన్ని కలామ్స్ వరల్డ్ రికార్డ్స్ వారు గుర్తించారని బేగంపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అంజి రెడ్డి తెలియజేశారు. విద్యార్థి కార్తీకను, గైడ్ ఉపాధ్యాయులు కొల్కూరు భాస్కర్ రెడ్డిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.