కొండాపూర్, సెప్టెంబర్ 30: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్లెపల్లికి చెందిన బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిగిరి కృష్ణమూర్తి, కొత్తగడి అమర్నాథ్ మంగళవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మల్కాపూర్ శివారులోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాను న్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండాపూర్ మం డలంలోని జడ్పీటీసీ, ఎంపీపీ పీఠాలను కైవ సం చేసుకొని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కార్యకర్తలకు సూ చించారు.
ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో యూరియా కొరత లేదని, ఆటో డ్రైవర్‌కి డబ్బులు ఇస్తే ఇంటికే యూరి యా తీసుకువచ్చేవాడని గుర్తుచేశారు. మళ్లీ అలాంటి రోజులు రావాలంటే మండలంలో గులాబీజెండా ఎగురవేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ముఖీం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మ్యాకంవిఠల్, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పద్మావతీపాండురంగం, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎండీ రుక్ముద్దీన్, మాజీ మం డల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు రాందాస్, శ్యామ్‌రావు, మాజీ సర్పంచ్ ప్రకాశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరి, జైరామ్, ప్రభుదాస్, ప్రేమానం దం, శేఖర్, నాయకులు రవీందర్, నరేందర్, లింగారెడ్డి పాల్గొన్నారు.