సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 9: సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో బుధవారం సాయం త్రం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్న వేడుకలకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖఅతిథిగా హాజరయ్యారు.
కుటుంబసమేతంగా వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్..మహిళా ఉద్యోగులతో కలి సి బతుకమ్మ ఆడారు.అంతకుముందు బతుకమ్మకు కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశా రు. బతుకమ్మ ఆశీర్వదంతో జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.