రాయపోల్, సెప్టెంబర్ 30: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రాయపోల్ (Rayapole) మండల వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. దేవి మాల ధరించిన స్వాములు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక చింతనలో పూజలు చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం వేళలో దంపతులకు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేధ బ్రాహ్మణ పండితుల మంత్రోచనల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
కాగా రాయపోల్ పట్టణంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్టించిన దుర్గామాత మంగళవారం దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు బతుకమ్మ, ఇటు దసరా ఉత్సవాలు రావడంతో గ్రామాల్లో వారి వారి బంధువులు రావడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ పల్లె చూసిన గ్రామాల్లో పండుగ సంబురాలు కనిపిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు గ్రామాల్లోకి రావడంతో పల్లెలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కాగా మండల వ్యాప్తంగా దేవినవరాత్రి ఉత్సవాలతో పాటు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.