సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 30: కేసీఆర్ బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించి బసవేశ్వరుడి స్ఫూర్తి అంతటా చాటారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నా రు. బసవేశ్వరుడి జయంతి సందర్భంగా బుధవారం సిద్దిపేటలో బసవేశ్వరుని విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మా ట్లాడుతూ.. మానవతావాది, సంఘ సం స్కర్త, కుల, మత, వర్గ, వర్ణవ్యవస్థను రూపుమాపడానికి నిర్వరామ కృషి చేసిన దార్శనికుడు బసవేశ్వరుడు అని కొనియాడారు.
మహిళా సాధికారత కోసం బడుగు, బలహీన వర్గాల సమానవత్వం కోసం, అస్పృశ్యత నివారణ కోసం, మత ఛాందస వాదులను వ్యతిరేకించిన మహనీయుడు ఆయన అన్నారు. నాటి ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కోకాపేటలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో బసవ భవన్ నిర్మాణానికి రూ.10కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. సమ సమాజ స్థాపనకు బాటలు వేసిన బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు. అనంతరం మండలంలోని ఎల్లుపల్లిలో జరిగిన పోచమ్మ విగ్రహ ప్రతిస్ఠాపన కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.