సంగారెడ్డి, మార్చి12: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీల అమలుకు లబ్ధ్దిదారుల ఎంపిక ప్రక్రియకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు ప్రత్యేక శిబిరాలు ఏ ర్పాటు చేసిన విషయం తెలిసిందే. అభయహస్తం కార్యక్రమం ఏర్పాటు చేసి దరఖాస్తు ల స్వీకరించారు. మంగళవారం వరకు ఉచిత కరెంటు బిల్లులు అందకపోవడంతో పట్టణ వాసులు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన ప్రత్యేక కౌంటర్లకు ప్రజలు బారు లు తీరారు. ఉచిత కరెంటు బిల్లుకు నిబంధనలు పెట్టకపోయినా జీరో బిల్లులు రాకపోవడంతో ప్రజలు ఆందోళనతో కార్యాలయానికి పరుగులు పెట్టారు. ప్రభుత్వం అద్దె ఇండ్ల లో నివాసముంటున్న వారు కూడా అర్హులని ప్రకటించడంతో 200 యూనిట్లలోపు కరెం టు వాడుకునే వారు ఆధార్‌కార్డు, ఆహార భద్రతకార్డు, అద్దె ఇంటి కరెంటు బిల్లులతో మున్సిపల్ కార్యాలయంలో బారులుతీరారు. ఇప్పుడు రాకుంటే భవిష్యత్‌లో ఉచిత కరెంటు బిల్లులు రావేమోనని ఆందోళనతో ప్రజలు కార్యాలయానికి వచ్చారు.