మెదక్ మున్సిపాలిటీ, జూలై 18 : తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శప్రాయుడని, నాలుగు తరాలకు స్ఫూర్తినీయుడని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముం దుకెళ్తామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం, పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూ జీ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్టయ్య, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం జీకేఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తొలి, మలిదశ ఉద్యమాల్లో మనతో కలిసి పోరాటం చేసిన యోధుడు బాపూజీ అని కొనియాడారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఎన్నో పోరాటాలు చేసి, జీవితాంతం కృషి చేశారన్నారు. భవిష్యత్ తరాలు సైతం బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా రని తెలిపారు. బీసీ కులాల్లో కులవృత్తిదారులకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థికసాయం అందజేస్తుందన్నారు. బీసీనని చెప్పు కుని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ బీసీల అభ్యున్నతి కి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని విమర్శించారు. దేశంలోని బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రా ధాన్యతనిస్తుందన్నారు. కుల వృత్తులపై ఆధారపడ్డ వారికి ఆర్థికసాయం చేయడంతోపాటు అనేక అభివృద్ధ్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో పద్మశాలీ సం ఘానికి ఎకర స్థలం కేటాయించామని, పద్మశాలీ భవన నిర్మాణానికి పూర్తిగా సహకారిస్తానని హామీ ఇచ్చారు.
త్యాగశీలి లక్ష్మణ్ బాపూజీ..– రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య
త్యాగశీలి, మంచి మనసున్న మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సం ఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. తెలంగాణ ఏర్పా టుకు ఎన్నో త్యాగాలు చేసిన యోధుడని, తెలంగాణ కోసమే జీవితాంతం తపించారన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్య తిరేకంగా బాపూజీ పోరాటం చేశారని, ఆయన నాయకత్వ లక్షణాలను, త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవా లని పిలుపుచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. పేదప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రులను ఎదిరించిన వ్యక్తి బాపూజీ అని గుర్తు చేశారు. 1969 ఉద్యమంలో బాపూజీ తన ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేసి తెలంగాణ వచ్చే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టానని శపథం చేసిన పోరాట యోధుడన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తేనే అభివృద్ధ్ది సాధిస్తారని అనేవారని గుర్తు చేశారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు కేంద్రం బడ్జెట్ పెంచాలని, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, ప్రత్యేక మంత్రి త్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. దళిత బంధు పథకం మాదిరిగానే బీసీ బంధు పథకం పెట్టాలని ఆశిస్తున్నట్లు కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించే పద్మశాలి సంఘం భవనానికి రూ. 25లక్షలు మం జూరు చేస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు.
రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి పెద్దపీట– ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
పేదప్రజల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసినవా రిలో కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ కోసం తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన వీరుడని అన్నారు. బీసీలు అన్నిరంగాల్లో రాణించి గొప్పస్థాయిలో ఉండాలని కోరుకున్న వ్యక్తి అని పేర్కొన్నా రు. తెలంగాణలో సీఎం కేసీఆర్ బీసీల సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారనివివరించారు. తెలంగాణ యోధుల జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్మించే పద్మశాలీ భవనానికి నా వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
త్వరలో తూఫ్రాన్, రామాయంపేట పట్టణాల్లో బాపూజీ విగ్రహాల ఏర్పాటు
బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగరాం మాట్లాడుతూ.. తుఫ్రాన్, రామాయంపేట పట్టణాల్లో బాపూజీ విగ్రహాలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాములు, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, బీసీ సంఘం నాయకులు బీమరి శ్రీనివాస్, బొద్దుల కృష్ణ, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బొద్దుల సంతోష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడితోపాటు పలువురిని పద్మశాలీ సంఘం నాయ కులు సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు రుక్మిణి, బట్టి లలిత, జయశ్రీ, కిశోర్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, లింగం, మాజీ కౌన్సిలర్ చంద్రకళ, బీసీ నాయకులు పండరిగౌడ్, శ్రీపాల్, గుడ్ల వాణి, సుజాత, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.