హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 27 : ఆరుగాలం కష్టించి పంటను పండించే రైతన్నకు పెట్టుబడి సాయం అందించకుండా రాబంధులా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్‌ను తరమికొట్టాలని హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం కాంగ్రెస్ నాయకుల తీరుకు నిరసనగా ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న మాట్లాడుతూ.. రైతులను కష్టాలనుంచి గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖరాయడం రైతుల నోట్లో మట్టికొట్టడమేనన్నారు. రైతులను ఆదుకోలేని కాంగ్రెస్ నాయకులు రైతుబంధు ఇవ్వకుండా రాబంధులా కుట్రలు చేయడాన్ని రైతాంగం గమనించి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో తప్పుడు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. రైతులతో చెలగాటమాడుతున్న కాం గ్రెస్ నాయకులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. నిరసనలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడబోయిన రజినీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామ్రెడ్డి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి గోపాల్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనిత, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, పోతారం(ఎస్) సర్పంచ్ సాయిలు, మాలపల్లి సర్పంచ్ మల్లయ్య, కౌన్సిలర్లు గోవిందు రవి, బొజ్జ హరీశ్, బీఆర్ఎస్ నాయకులు బండి రమణారెడ్డి, పూదరి లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ నాయక్, యాటకార్ల స్వరూప, కొంకట రవీందర్, ముప్పిడి రాజిరెడ్డి, కూతాటి విజయభాస్కర్, వాల నవీన్‌రావు, ఎండీ. అయూబ్, ఇంతియాజ్, దుండ్ర జనార్దన్, పొలు సంపత్, బొల్లి శ్రీనివాస్, పూదరి శ్రీనివాస్, గడ్డం సదానందం, దొంతరబోయిన శ్రీనివాస్, బత్తుల చంద్రమౌళి పాల్గొన్నారు.

కోహెడ, అక్టోబర్ 27 : రైతులకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ కపట నాటకం ఆడుతుందని నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ధర్నా చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి, దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, సీనియర్ నాయకులు కొక్కుల సురేశ్, పాము శ్రీకాంత్, జాలిగాం శంకర్, పేర్యాల రాజేశ్వర్‌రావు, తిప్పారపు శ్రీకాంత్, అబ్దుల్ ఖదీర్, కోహెడ పరశురాములు, వెల్దండి సతీశ్, మంద రాజయ్య పాల్గొన్నారు.