నిండుకుండలాసింగూరు
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరదగా వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగింది.
- ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు
- ప్రస్తుతం 29.211 టీఎంసీల నీరు
- కొనసాగుతున్న 3962 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- వరద తీవ్రత పెరిగితే గేట్లు ఎత్తే అవకాశం
- ఈ సీజన్లో 3.1 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
పుల్కల్, సెప్టెంబర్ 10: బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరదగా వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగింది. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 3248 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 29.211 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 3248 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
అందులో విద్యుత్ ఉత్పత్తికి 2783 క్యూసెక్కులు, హెచ్ఎండబ్ల్యూఎస్కు 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 70 క్యూసెక్కులు, ఈవీపీ 315 క్యూసెక్కులు వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో సందర్శకులను డ్యాం పైకి అనుమతించడం లేదు. నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకు 2783 క్యూసెక్కుల నీరు విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 7.5 మెగా వాట్ల సామర్థ్యం గల రెండు టర్బైన్ల ద్వారా 3.1 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఏడీ కుర్మి పాండయ్య తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

