MPDO Office | మెదక్ రూరల్, అక్టోబర్ 28 : మెదక్ ఎంపీడీవో కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు మౌలిక వసతులు కరువయ్యాయి. బహిరంగ మలమూత్ర విసర్జన చెయ్యకూడదని, మరుగుదొడ్లను వాడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రతి సమావేశంలో నీతి వాక్యాలు వల్లించే అధికారులు ఆచరణలో మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ప్రజలకు మౌళిక వసతులు కల్పించే మాట అటు ఉంచితే కనీసం ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ గాలికి వదిలేయడంతో అవి అధ్వానంగా తయారై కంపు కొడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. మెదక్‌కు రెగ్యులర్ ఎంపీడీవో లేకపోవడతో కార్యాలయంలోని మోటార్ పాడై నీటి సమస్య తలెత్తినా సమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
సిబ్బంది సరైన సమయంలో రాకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ ఎంపీడీవో లేకపోవడం ఇందుకు కారణమని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రెగ్యులర్ ఎంపీడీవోను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
Cyclone Montha | మొంథా ఎఫెక్ట్.. చెన్నైలో భారీ వర్షం.. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
Shaligouraram | తేమ పేరుతో పత్తి కొనుగోలు చేయడంలే.. శాలిగౌరారంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు
Cyclone Montha | దూసుకొస్తున్న ‘మొంథా’.. అల్లకల్లోలంగా ఒడిశా తీరం.. Video