నర్సాపూర్ : నర్సాపూర్ మున్సిపాలిటీలో నెలకొన్న నీటి ఎద్దడిని అరికట్టి నీటి సమస్యను పరిష్కరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని 1 వ వార్డ్ జగన్నాథరావు కాలనీలో అశోక్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రానందున కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్ల నుండి ట్యాంకర్లతో నీటిని సిబ్బంది సరఫరా చేస్తున్నారని అన్నారు.
అలాగే జగన్నాధ రావు కాలనీలో బోరు చెడిపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడిందనీ ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి వెంటనే బోరు మోటారు రిపేర్ చేయించాలన్నారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే వర్షాలు చాలా పడుతున్నందున వార్డులో ఇండ్ల పక్కన చుట్టుపక్కల ఎలాంటి చెత్తాచెదారం లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.