సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబరు 30: ఆశవ ర్కర్ల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురా లు కనకవ్వ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..20 ఏండ్ల నుం చి విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభు త్వం నుంచి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నామన్నారు.
ఆశవర్కర్లకు నెలకు పద్దెనిమిది వేలు జీతం, ఉద్యోగ భద్రత, యాక్సిడెంట్, సహ జ మరణానికి ఎక్స్గ్రేషియా, హెల్త్ కార్డు, కొత్త ఆశల నియామకం, అర్హత కలిగిన ఆశలకు ప్రమోషన్, ప్రభుత్వ పథకాల వర్తింపు, పెండింగ్ ఇన్సెంటివ్స్పై డిమాండ్లను, సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో ఆశ వర్కర్లు పాల్గొన్నారు.