జహీరాబాద్ : విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్( Artisans ) ల సమస్యలు పరిష్కరించాలని జహీరాబాద్ డివిజన్ జేఏసీ నాయకులు జైపాల్, సంతోష్, రాజప్ప డిమాండ్ చేశారు. సమ్మె మూడో రోజున శుక్రవారం జహీరాబాద్ పట్టణం విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో గాంధేయ మార్గంలో కార్మికులు టోపీలను (Caps) ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో ఆర్జిజన్లుగా పనిచేస్తున్నవారి విద్యార్హతలను బట్టి వారికి కన్వెర్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వారికి ప్రత్యేక పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సమస్యను పరిష్కరించేంత వరకు సమ్మెలో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేష్, రాజప్ప ,మొగులప్ప ,సత్యంధర్ రెడ్డి, విష్ణు, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.