అమీన్పూర్, ఫిబ్రవరి 24 : హైదరాబాద్కు సమీపంలోని ఉన్న బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధ్ధమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ పాలక వర్గం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పా ట్లు చేస్తున్నారు. సుమారు 2 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 27న భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యా ణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. స్వామి వారికి వసంతోత్సవం, చివరి రోజు పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఈ ఆలయా నికి ఘనమైన చరిత్ర ఉంది. ఆలయానికి నైరుతి దిక్కునుంచి శ్రీశైలం వరకు సొరంగ మార్గం ఉన్నట్లు పెద్దలు చెబుతుంటారు. ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ జ్యోతిరెడ్డి తెలిపారు. ఆలయ కమి టీ అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ మాట్లా డుతూ.. జిల్లాలోనే భారీ స్థాయిలో ఉత్సవా లు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. పాలక వర్గం, అధికారులు ఏర్పాట్లతో నిమగ్న మైనట్లు ఆయన తెలిపా రు. ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అమీన్ పూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నరేశ్ తెలి పారు. శాంతియుతం గా ఉత్సవాలు విజ యవంతంగా ముగి సేందుకు భక్తులంతా పోలీసులకు, ఆలయ కమిటీకి సహకరిం చాలని ఆయన కోరారు.