నేడు వీడనున్న ఉత్కంఠ
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్లను నియోజకవర్గాల వారీగా లెక్కిస్తారు.
- జహీరాబాద్ పార్లమెంట్‌కు సంబంధించి గీతం యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
- అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కింపు
- ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు, గరిష్టంగా 23 రౌండ్లు
సంగారెడ్డి జూన్ 3 (నమస్తే తెలంగాణ): జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్లను నియోజకవర్గాల వారీగా లెక్కిస్తారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఏడు నియోజకవర్గాలకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. కనిష్టంగా 19 రౌండ్ల నుంచి గరిష్టింగా 23 రౌండ్ల వరకు ఓట్ల లెక్కించనున్నారు.
మొదట జుక్కల్, బాన్సువాడ ఫలితాలు
జహీరాబాద్ పార్లమెంట్‌కు 1973 పోలిం గ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగ్గా 74.63 శాతం పోలింగ్ నమోదైంది. 12,25,049 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొదట జుక్కల్, బాన్సువాడ ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. జుక్కల్‌లో 255 పోలింగ్ కేంద్రాలకు 14 కౌంటింగ్ టేబుళ్లు, 19 రౌండ్లు ఓట్లు లెక్కించనున్నారు. బాన్సువాడలోని 258 పోలింగ్ కేంద్రాలకు 14 కౌంటింగ్ టేబుళ్లలో 19 రౌండ్లు ఓట్లు లెక్కిస్తారు. ఎల్లారెడ్డిలో 270 పోలింగ్ కేంద్రాలకు 14 కౌంటింగ్ టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. కామారెడ్డికి సంబంధించి 266 పోలింగ్ కేంద్రాలకు 14 కౌం టింగ్ టేబుళ్లలో 19 రౌండ్లు ఓట్లు లెక్కిస్తారు. నారాయణఖేడ్‌లో 296 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లలో 22 రౌండ్లలో ఓట్లు లెక్కింపు పూర్తవుతుంది. అందోలులో 313 పోలింగ్ కేంద్రాలకు సంబందించి 14 టేబుళ్లలో 23 రౌండ్లు ఓట్లు లెక్కింపు జరుగుతుంది. జహీరాబాద్‌కు సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 23 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కించే టేబుళ్ల వద్ద ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఏఆర్వోలు ఉంటారు. ఎన్నికల పరిశీలకులు గోపాల్ జి.తివారీ, ప్రదీప్‌సింగ్ సంగ్వాత్ పర్యవేక్షణలో ఓట్ల లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గీతం యూనివర్సిటీ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

