సిద్దిపేట టౌన్,డిసెంబర్ 29 : అప్పుల బాధ తాళలేక ఏఆర్ కానిస్టేబుల్ తన భార్యాపిల్లలకు ఎలుకల మందు ఇచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట కాళ్లకుంట కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు,బాధితుల వివరాల ప్రకారం..రాజన్నసిరిసిల్ల జిల్లా లిం గన్నపేట గ్రామానికి చెందిన బండారి బాలకృష్ణ (34) పదేండ్లుగా ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.ప్రస్తుతం రాజన్నసిరిసిల్లలోని 17వ బెటాలియన్‌లో ఎఆర్ కానిస్టేబుల్‌గా విధు లు నిర్వహిస్తున్నాడు. కొత్తగా ఇంటి నిర్మాణానికి కొంత అప్పుచేయగా, ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీని నమ్మి రూ.25 లక్షల వరకు పెటుబడి పెట్టి మోసపోయా డు.
వీటికోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనబడక శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు.తాను ప్రైవేట్ కంపెనీలో డబ్బులు పెట్టి మోసపోయానని భార్యతో బాలకృష్ణ చెప్పి బాధపడ్డాడు.అప్పుల వారు వేధించకుండా ఉండాలంటే ఆత్మహత్య ఒక్కటే మార్గం అని అనుకున్నాడు. వెంటనే కుంటుంబీకులకు ఎలుకల మం దు కలిపిన చాయిని తగించి తాను తాగా డు.ఏమి కాకపోవడంతో మరో గదిలోకి వెళ్లి ప్యాన్ కు బాలకృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆదివారం తెల్లవారుజామున భర్త బాలకృష్ణ కనిపించక పోవడంతో మరోగదిలో చూడగా ప్యాన్‌కు వేళాడుతూ కనిపించాడు. వెంటనే ఇంటి పక్కవారికి, కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపింది.
అప్పుల వారి నుంచి తప్పించుకోవాలంలే మరణం ఒక్కటే మార్గం అని నమ్మిన బాలకృష్ణ, తన కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా పథకం అమలు చేశాడు. ముందుగా అనుకున్నట్లు ఎలుకల మందు ను తన వెంట ఇంటికి తెచ్చాడు. భార్య మానసకు చాయి పెట్టమని చెప్పి ఎలుకల మందును కలిపి చాయి తాగారు.అయినా ఎవరికి ఏమీ కాకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కడుపులో తిప్పినట్టుగా కావడంతో స్థానికులు బాలకృష్ణ కుటుంబ సభ్యులను దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి ఎలుకల మందు తాగారని నిర్ధారించారు. అంత వరకు భార్య మాన స, కొడుకులు యశ్వం త్, అశ్విత్‌కు తాము పురుగుల మందు తాగిన విషయం తెలియదు. పురుగుల మందు తాగిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు.కానిస్టేబుల్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.