KGBV | మనూరు, జూలై 04 : ఖాళీగా ఉన్న పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని కేజీబీవీ ప్రత్యేక అధికారి రాజేశ్వరి శుక్రవారం తెలిపారు. మనూరు మండల పరిధిలోని పుల్కుర్తి గ్రామంలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో వంట మనిషి పోస్టు ఖాళీగా ఉందని అన్నారు. ఇందుకు గాను ఆసక్తి గల స్థానిక మహిళలు ఈ నెల 8వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. కనీస అర్హత 7వతరగతి లేదా ఆపైన చదిన స్థానిక మహిళ అభ్యర్థులు అయి ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలకు పుల్కుర్తి కేజీబీవీ పాఠశాలకు వచ్చి సంప్రదించాలని కోరారు.