వెల్దుర్తి, జూన్ 19 : మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని పట్టణ కేజీబీవీ పాఠశాలలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మండల విద్యాధికారి యాదగిరి, పాఠశాల ఎస్వో ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పాఠశాలలో హెడ్కుక్, స్వీపర్, నైట్‌వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందుకోసం కనీసం పదో తరగతి పాస్ అయిన వారు, హెడ్కుక్ కోసం పెద్ద మొత్తంలో వంట చేయడంతో పాటు రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులని తెలిపారు. అలాగే 21 నుండి 45 ఏండ్ల వయసు కలిగి, వెల్దుర్తిలో నివాసం ఉండేవారు ఈ నెల 24 వరకు స్థానిక పాఠశాలలో దరఖాస్తులు అందించాలని వారు సూచించారు.