చిన్నకోడూరు, ఆగస్టు 03 : చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో 16 గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జి. స్నేహలత తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థలో ఆయా రకాల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత అర్హతలు ఉన్న అభ్యర్థులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారాలను కాలేజీ కార్యాలయంలో పొందాలన్నారు. కళాశాలలో ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం 16 పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీగా భర్తీ చేయడం జరుగుతుందన్నారు.
కెమిస్ట్రీ 01, ఫిజిక్స్ 01, మ్యాథ్స్ 01, ఇంగ్లీష్ 01, ఈఈఈ 03, సివిల్ 04, కంప్యూటర్ ఇంజనీరింగ్ (సిఎంఈ) 05 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్ ఎంఈ/ ఎం.టెక్, బీఈ/ బీటెక్/ ఎం. పి హెచ్ఐఎల్/ పీహెచ్. డి ఎంఎస్సీ అర్హతలు కలిగిన నిరుద్యోగులు విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఉండాలన్నారు. దరఖాస్తులను ఆగస్టు 01 నుంచి ఆగస్టు 05 వరకు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 05న దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూలు, ఆగస్టు 07న గెస్ట్ లెక్చరర్లకు ఆదేశాల జారీ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ముందస్తుగా తమ సర్టిఫికెట్ల ప్రతులతో పాటు పూర్తి వివరాలతో కలిగిన దరఖాస్తును నిర్ణీత తేదీలలో కళాశాలలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8096907520 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపల్ స్నేహలత కోరారు.