సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు ధ్వజమెత్తారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రైతుబంధు అందిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పథకాన్ని నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టే కుట్ర ఆ పార్టీ చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ సరఫరా చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కర్ణాటకలో వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేయకపోవడంతో రైతులు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారన్నారు.రైతుబంధు నిలిపివేసే కుట్రచేస్తున్న కాంగ్రెస్‌కు శాసనసభ ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.
జహీరాబాద్, అక్టోబర్ 26 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి, నిలిపివేసేందుకు కుట్ర చేస్తున్నదని రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్‌రావు ఆరోపించారు. గురువారం జహీరాబాద్ మండలంలోని దిడ్గిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపూరం శివకుమార్‌తో కలిసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు.. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి దీంతో రైతు పథకం ఏర్పాటు చేసి పంట పెట్టుబడి కోసం ఎకరాకు రెండు పంటలకు రూ. 10 వేలు ఇస్తున్నారన్నారు. యాసంగిలో రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధ్దంగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఫిర్యాదు చేయడంపై మండిపడారు. రైతుల నోట్లలో మట్టి వేసే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ సరఫరా చేసే, కాంగ్రెస్ నాయకులు వ్యవసాయకి 3 గంటల కరెంట్ చాలు అని మాట్లాడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో వ్యవసాయనికి కరెంట్ సరఫరా చేయకపోవడంతో రైతులు రోడ్లుపై ఆందోళనలు చేస్తున్నారన్నారు. ప్రజలను భయాందోళన కలిపించేందుకు కుట్ర చేస్తుందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధ చెబుతారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాకుండా కుట్ర చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్‌రావు అన్నారు. ప్రజలకు అన్నం పెట్టే రైతులకు సీఎం కేసీఆర్ ఇస్తూ రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాద చేయడం తగదన్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పథకాన్ని అడ్డుకుంటే తెలంగాణలో ఉన్న 68 లక్షల మంది రైతులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఉందని ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపూరం శివకుమార్ వివరించారు. తెలంగాణలో రైతు బం ధు పథకం పొందుతున్న రైతులు రోడ్డు పైకి వచ్చి కాంగ్రెస్ పార్టీని తరమికొట్టే రోజులు వస్తాయన్నారు. ప్రపంచంలోనే ఎక్కవ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఉందన్నారు. సమావేశంలో అత్మ కమిటీ చైర్మన్ పెం టారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి. గుండప్ప, జహీరాబాద్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తట్టు నారాయణ, నేతలు ఉన్నారు.