అందోల్, జూన్ 18: రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చేపడుతున్న సంస్కరణలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగమేశ్వర్, లక్ష్మణ్, వార్డు సభ్యులు అనంతయ్యతోపాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. అందోల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టేది మనమేనని, అందోల్ గడ్డపై భారీ మెజార్టీ నమోదు చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాల’ని పిలుపునిచ్చారు.
చేగుంట, జూన్ 18: మండల కేంద్రమైన నార్సింగి గ్రామానికి చెందిన కురాకుల కనకయ్య బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలరాం బాబు ఆధ్వర్యంలో ఆదివారం ఆ పార్టీలో చేరారు. కనకయ్య బీజేపీ బూత్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.