మెదక్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలను విన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న అధికారులకు వివరించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇల్లు, పింఛన్లు, భూ సమస్యలు, ఇతర సమస్యలపై 60 మంది ఎమ్మెల్యేకు లిఖితపూర్వక వినతులను అందజేశారు. ప్రతి ఒక్క రి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో మీ కోసం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యలు పరిష్కారం అవుతుండడంతో ప్రజల నుంచి అనూ హ్య స్పందన వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్యారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్‌రెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు ఎం.గంగాధర్, మెదక్, పాపన్నపేట రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, కిష్టయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.